HYD: నగరంలో ప్రజా పాలన, పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం వాణిజ్య సముదాయాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేశారు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై ఆరా తీశారు. మొత్తం 252 భవనాలను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు. సెల్లార్లలో ప్రమాదకర పదార్థాలను నిల్వ చేయవద్దని యజమానులను హెచ్చరించారు.