E.G: రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30.36 లక్షల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. మలికిపురంలో అర్జున్ను అరెస్ట్ చేసి రూ. 17.15 లక్షల సొత్తును, రామచంద్రపురంలో సీతారాముడును అదుపులోకి తీసుకుని రూ. 13.21 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.