TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం తనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతని పేరు వెంకటేశ్వర్లు అని మాత్రం వైద్యులకు తెలిపినట్లు ఎస్సై అన్నారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.