TG: రంగారెడ్డి(D) మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడినవారిని రహస్య ప్రాంతానికి తరలించారు. మరికాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. సిమ్లా నుంచి కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. సిమ్లా నుంచి రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌కి ఎన్నిసార్లు డ్రగ్స్ వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.