SKLM: పొందూరులో ఇవాళ్టి నుంచి మంగళవారం వరకు 3 రోజులపాటు పైడితల్లి అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. 15 ఏళ్ల తర్వాత జరిగే జాతర కావడంతో మండలంలో ప్రత్యేకత చోటుచేసుకుంది. 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.