KNR: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ విజయంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘మోదీ గిఫ్ట్’ కింద సైకిళ్ల పంపిణీని సంజయ్ వివరించగా.. ప్రధాని అభినందించారు. అట్టడుగు వర్గాలకు కేంద్ర సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేయాలని మోదీ అన్నారు.