PLD: కారంపూడి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో అనిల్ కుమార్, రవికుమార్‌లు తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.