BPT: నిజాంపట్నం మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంఈఓ శోభాచంద్ తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మండలంలోని 4 కేంద్రాల్లో 640 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.