SDPT: సిద్దిపేటలో బంగారు పుస్తెలతాడును మార్చి నకిలీని అంటగట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ ఆర్ఆండ్ఆర్ కాలనీకి చెందిన గున్నాల అనురాధ, ఆమె మేనమామ కుమారుడు ఎల్లరాజు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్ 19న అనురాధ వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని, దాని స్థానంలో నకిలీని ఇచ్చారు.