GDWL: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, పట్టుదలతో చదివి సమాజంలో గొప్ప స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలోని వసతులను, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.