GNTR: పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 2.20 లక్షల విలువైన చెక్కులను శనివారం అందజేశారు. టీడీపీ మండల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడూరి రాంబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.