ASF: రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ SI వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై శనివారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళాబృందం తమ ఆటపాటలతో వాహనదారులను అలరిస్తూనే నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు.