ATP: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న అనంతపురంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ విందుకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. రంజాన్ పవిత్ర మాసంలో సామరస్యాన్ని చాటుతూ ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ముస్లిం సోదరుల పట్ల గౌరవార్థం ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.