కర్నూలు జిల్లాలో రేపటి నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు DEO సుధాకర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల కోసం సెక్షన్ 144 అమల్లో ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 160 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 37,331 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు.