ADB: జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే సమయంలో ఇంట్లో ఎవరు లేని పక్షంలో బి.ఎల్.ఓలు కనీసం మూడుసార్లు ఆ ఇంటిని సందర్శించాలని ఆదేశించారు.