TG: యుద్ధం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. విజయవాడకు సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉండగా ఇప్పుడు కనిష్టంగా రూ.5,200, గరిష్టంగా రూ.7,300 అయింది. దీంతో శంషాబాద్ నుంచి రోజూ రాకపోకలు కొనసాగించే సుమారు 90 వేల మంది ప్రయాణికులపై ఇంధన సర్ఛార్జి భారం పడనుంది.