WG: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8,815 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. వీటిలో 8,261 క్రిమినల్, 166 సివిల్, 147 వాహన బీమా, 94 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల సమయం, ధనం ఆదా అవుతాయని ఆమె పేర్కొన్నారు.