SRCL: పంట పొలాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వేములవాడ మండలం మారుపాక గ్రామంలో శనివారం రైతులు ఆందోళన చేశారు. విద్యుత్ కొరత పై గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమకు పొలాలకు నీరు సరఫరా అయ్యేఎందుకు సరిపడా కరెంటు సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు సెస్ ఏ ఈకి రైతులు వినతి పత్రం అందజేశారు.