TG: హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్బాగ్లో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 6,427 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు మధ్య అధికారులు ప్రభుత్వ స్థలంలో ఉన్న షెడ్లను తొలగించారు. అనంతరం దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.