NDL: కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల మజార గ్రామం చదరంపెంట గూడెంకు చెందిన గిరిజన వృద్ధుడు నిమ్మల పెద్ద అంకన్నపై నిన్న ఎలుగుబంటి దాడి చేసింది. గూడెం పక్కన ఉన్న గొరిసెల కాల్వ వద్ద దుస్తులు ఉతుకుతుండగా అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేయడంతో గాయపడ్డట్లు తెలిపాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.