SKLM: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దినకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 1,13,102 మంది అభ్యాసకుల కోసం 1462 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షను విజయవంతం చేయాలన్నారు.