ధనురాసనం వెన్నెముకను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి అద్భుతమైన యోగాసనం. పొట్ట భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఇది ఛాతీని తెరిచి, లోతైన శ్వాసను ప్రోత్సహించడం ద్వారా ఆందోళన, అలసటను తగ్గిస్తుంది. భుజాలు, ఛాతీని సాగదీయడం ద్వారా, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చునే వారిలో వచ్చే భుజాల వంపులను తగ్గిస్తుంది.