MLG: జంగాలపల్లి సమీపంలో వేర్వేరు చోట్ల పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు రెండవ టౌన్ SI చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.4,520 నగదును స్వాధీనం చేసుకొని.. ఏడుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. పేకాట ఆడడం చట్ట విరుద్ధమని, జూదంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.