ప్రకాశం: ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించి గ్రామపంచాయతీ అధికారులకు సహకరించాలని డివిజనల్ పంచాయతీ అధికారి బాలు నాయక్ తెలిపారు. శనివారం కంభం గ్రామపంచాయతీ పరిధిలో పలు గృహాల వద్దకు వెళ్లి ఇంటి పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభం ఎంపీడీవో వీరభద్రచారి పాల్గొన్నారు.