ADB: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మితిమీరి అమాయకులను మోసం చేస్తున్న సందర్భంలో ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. థర్డ్ పార్టీ అప్లికేషన్లను వినియోగిస్తూ మొబైల్ ఫోన్లో వాటికి పూర్తిగా అనుమతులను ఇవ్వడం వల్ల మొబైల్ ఫోన్ డాటా అనేది చోరీకి గురవుతుందని పేర్కొన్నారు.