TG: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవనున్నారు.