SRD: పటాన్చెరు డివిజన్ చైతన్య నగర్ కాలనీలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్ పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరకే శుభకార్యాలు జరుపుకోవాలన్న లక్ష్యంతో వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి పనులు మరెన్నో చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.