SRD: ఆధునిక విద్యా సదుపాయాలతో భవిష్యత్ తరాల అభివృద్ధికి సమీకృత పాఠశాల కీలకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం సిర్గాపూర్ మండలం వాలు తండా వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సైట్ ప్లాన్, డిజైన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.