E.G: భవిష్యత్ తరాలకు ఆరోగ్యభరితమైన జీవితం అందించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ICDS ఆవరణలో జరిగిన పోషణ్ పఖ్వాడా కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ‘పోషణ్ పఖ్వాడా కార్యక్రమం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యభరితమైన జీవితం అందించే మహత్తర ఉద్యమం’ అని ఆయన పేర్కొన్నారు.