పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తమ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డులో ప్లానింగ్ సెక్రటరీ స్వయంగా వెళ్లి రోడ్డు ఎంత మేర ఉండాలో కొలతలు వెయ్యాలన్నారు. ఆక్రమణలు గుర్తిస్తే యజమానులకు ముందస్తు సమాచారమిచ్చి డెమొల్యూషన్ చేపట్టాలన్నారు. తద్వారా పట్టణంలో ట్రాఫిక్ తదితర సమస్యలు తగ్గుతాయన్నారు.