ATP: తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలోని బృందావనంపై అచ్యుతదేవరాయల కాలం నాటి తెలుగు శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. క్రీస్తుశకం 1539లో 12 మంది ఆళ్వారుల ప్రతీకగా ఈ బృందావనం నిర్మించినట్లు శాసనం ద్వారా తెలిసిందని మైనాస్వామి తెలిపారు.