ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, నాయకులతో గురువారం ఆర్డీవో అజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని తహసీల్దార్లు, ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు, అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.