HYD: జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమీ ముందడుగు వేసింది. సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి HYDలో నాంపల్లి సమావేశంలో ఇవాళ తెలిపారు. 17 మంది మృత జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సాయం, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పెన్షన్ అందించనున్నారు.