AP: ‘ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్& థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ నూతన పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కార్పొరేషన్ ఛైర్మన్గా పి. భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు మరో 14 మంది సినీ ప్రముఖులను బోర్డు డైరెక్టర్లు (సభ్యులు)గా ప్రభుత్వం నియమించింది.