ELR: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కొండంత అండగా నిలిచారు. వేగవరం ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సహాయం కోరారు. వారి పరిస్థితిపై వెంటనే స్పందించి రూ.3.40 లక్షల విలువైన ఎల్ఓసి (LOC) లెటర్‌ను అందజేశారు.