JGL: మల్యాల మండలం ముత్యంపేట సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్లో గురువారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కెనాల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.