ASF: జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ మద్దతు తెలిపారు. సుమారు 2 వేల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందని, రైతుల వద్ద 30 వేల క్వింటాళ్లకు నిల్వ ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని జైనూర్‌లో ఏర్పాటు చేయడంతో రవాణా కాంటా ఆలస్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.