కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట శివారులో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగిరెడ్డిపేటకు చెందిన బూరుగుపల్లి కృష్ణ(38) వివాహం కావడం లేదని జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు ఏఎస్ఐ చారి తెలిపారు. మృతుని తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.