MBNR: జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ భూములు సంరక్షించాలని 44 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను అధికారులు విరమింపజేశారు. అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లు భూములను సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాల నేతలు దీక్షలు విరమించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.