VSP: ఆరిలోవలోని ఏనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. నగరంలోని నాలుగు ఏబీసీ కేంద్రాల్లో ప్రస్తుతం రోజుకు 65-70 కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలుసుకున్నారు. ఈ సంఖ్యను 100కు పెంచాలని సిటీ వెటర్నరీ అధికారిని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణతో పాటు యాంటీ రేబిస్ టీకాలు వేయాలన్నారు.