మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్లోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో వేసిన భారీ సెట్లో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రాపై ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరించేందుకు జక్కన్న బృందం సిద్ధమైంది. ఈ పాన్-వరల్డ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.