గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘పెద్ది’ మూవీ జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై ఎదురైన ప్రశ్నపై చరణ్ స్పందించాడు. తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. వినోద రంగంలోనే నంబరు 1 అనిపించుకోవాలని ఉందని తెలిపాడు. రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవడం లేదన్నాడు.