SRPT: వ్యవసాయ భూములున్న ప్రతి రైతు విధిగా రైతు రిజిస్ట్రేషన్ ఐడీ చేయించుకోవాలని మునగాల మండలం నరసింహపురం సర్పంచ్ వేమూరి సత్యనారాయణ సూచించారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరి అని ఆయన రైతులకు స్పష్టం చేశారు.