BDK: జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఖచ్చితత్వం పాటించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్ అధికారులకు సూచించారు. గృహాలు, కుటుంబ సభ్యులు, మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొరపాట్లు తలెత్తకుండా డేటాను పునఃపరిశీలించి నాణ్యమైన సమాచార సేకరణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.