AKP: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్ష భావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్ 14 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి గురువారం తెలిపారు. వర్షపాతం తాగునీరు, పంటల స్థితిగతులు, పశువులకు దాణా నిలువలు తదితర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.