MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తూ నలుగురు వ్యక్తులు గురువారం పోలీసులకు పట్టుబడ్డారు. SI నరేష్ వివరాల ప్రకారం.. పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని విచారించగా గంజాయి సేవించినట్లు వారు అంగీకరించారు. నిందితులను 15 రోజుల పాటు డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించామన్నారు.