ADB: రోజువారి జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ఈత పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు ప్రశంస పత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, DYSO శ్రీనివాస్ తదితరులున్నారు.