KMR: న్యాయపరమైన చట్టాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్య దర్శి నాగరాణి సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్స్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నల్సా చట్టం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.