NZB: జిల్లాలోని పలు గ్రామాల్లో ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం సంబంధిత అధికారులతో కలిసి ట్రాన్స్ జెండర్లు, సర్పంచ్లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.