ATP: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ద్వితీయ భాష పరీక్షల హాజరు వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 3,279 మంది, ఒకేషనల్‌లో 332 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్‌లో 1,728 మంది, ఒకేషనల్‌లో 199 మంది హాజరయ్యారు.